News April 13, 2025
పులిచెర్ల: బావిలో పడి 12 ఏళ్ల బాలుడి మృతి

పులిచెర్ల మండలంలో విషాదం నెలకొంది. అయ్యవారిపల్లెకు చెందిన సురేశ్-లత దంపతుల కుమారుడు దిలీప్ (12) శనివారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. వారు బెంగళూరు నుంచి ఉగాదికి స్వగ్రామానికి వచ్చారు. పొలం వద్ద చెల్లెలితో దిలీప్ ఆడుకుంటుండగా పొరపాటున బాల్ బావిలో పడింది. దాన్ని తీసుకునేందుకు వెళ్లిన దిలీప్ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News October 17, 2025
చిత్తూరు: సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు

చిత్తూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ఇందుకు రూ.5 వేలను ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలన్నారు. ముందుగానే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 16, 2025
17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.
News October 16, 2025
కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.