News February 3, 2025
పులివెందులలో అరటికాయల వ్యాపారి హత్య

పులివెందుల పట్టణం స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి అరటికాయల మోహన్‌పై కొంతమంది దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. అరటికాయల వ్యాపారి రూ.2 వేలు అప్పు చెల్లించలేదనే నెపంతో కొంతమంది దాడి చేసినట్లు తెలుస్తోంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందినట్లు తెలిసింది.
Similar News
News February 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.15,910
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.14,637
*వెండి 10 గ్రాముల ధర: రూ.2,675 గా ఉన్నాయి.
News February 12, 2026
కడప: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో కడప జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.
News February 12, 2026
మంత్రికి విన్నవించుకున్న MP అవినాశ్ రెడ్డి

ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్‌లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.


