News January 14, 2025
పులివెందులలో జోరుగా కోళ్ల పందేలు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని పులివెందులలో తొలిసారి జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని ఉలిమెల్ల, మండలంలోని ఈ.కొత్తపల్లి, ఎర్రిపల్లె తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో తొలిరోజే రూ.2 కోట్లకు పందేలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో 8 చోట్ల బరులు ఏర్పాటు చేయగా.. లింగాల మండలంలోనే దాదాపు రూ. 50 లక్షలకు పందేలు జరిగినట్లు సమాచారం.
Similar News
News November 24, 2025
ప్రొద్దుటూరులో అంతా జీరో వ్యాపారమే..?

ప్రొద్దుటూరులో జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఇక్కడ ఫైనాన్స్, బంగారం, హవాలా, సినిమా, రియల్ ఎస్టేట్, ఎలక్షన్స్లో ఇక్కడి వ్యాపారులు రూ.వేల కోట్లు పెట్టుబడులు, రుణాలు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రభుత్వ అనుమతులు, పన్నులు లేకుండానే సాగుతున్నట్లు సమాచారం. వ్యాపారి శ్రీనివాసులుపై జీరోలో అభరణాలు, స్కీములు, చీటీల వ్యాపారంపై ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి.
News November 24, 2025
ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారి బాధితులు ఎందరో..?

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి తనిగంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వ్యాపారంలో మోసం చేసి తమను బయటికి గెంటేశారని మరదలు పద్మజ ఫిర్యాదు చేశారు. HYD హేమంత్ శర్మ, మార్వాడి షమీర్, JMD సంధ్య, BDVL శ్రావణి, లేఖ ఇలా ఎందరో తమకు బంగారం బాకీ ఉన్నాడంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చట్ట విరుద్ధంగా స్కీం, చీటీల వ్యాపారంలో మోసం చేశాడంటూ బాధితులు వాపోతున్నారు.
News November 24, 2025
రేపు పులివెందులలో జగన్ పర్యటన

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.


