News May 11, 2024
పులివెందులలో పోలింగ్ ఏర్పాట్లపై SP సమీక్ష
పులివెందుల నియోజక వర్గ పరిధిలో 13న జరిగే పోలింగ్‌కు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద అనుసరించాల్సిన విధానాలపై ఆయన అధికారులుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News November 5, 2024
9న కడప జిల్లాకు CM చంద్రబాబు
ఈనెల 9వ తేదీన కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటకు రానున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిచాక మొదటిసారి జిల్లాకు రానుండగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
News November 5, 2024
రాజకీయ వేడి పుట్టిస్తున్న రాచమల్లు ప్రెస్మీట్లు
మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంగళవారం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇటీవల ఆయన వరుస ప్రెస్మీట్లతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా జగన్ ఆస్తులకు సంబంధించి వైఎస్ షర్మిల, విజయమ్మలపై కూడా ప్రశ్నలు సంధించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలపై మీ కామెంట్.
News November 5, 2024
కడప శివాలయంలో MLA మాధవి పూజలు
కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా కడప MLA మాధవి శివున్ని దర్శించుకున్నారు. కడపలోని మృత్యుంజయ కుంటలో వెలిసిన శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా తోటి భక్తులతో కలిసి సామాన్యురాలిగా కార్తీక దీపాలను వెలిగించి ఆమె మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు.