News May 11, 2024

పులివెందులలో పోలింగ్ ఏర్పాట్లపై SP సమీక్ష

image

పులివెందుల నియోజక వర్గ పరిధిలో 13న జరిగే పోలింగ్‌కు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద అనుసరించాల్సిన విధానాలపై ఆయన అధికారులుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News February 18, 2025

కడప: YVU వీసీగా ప్రకాశ్ బాబు

image

యోగి వేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రకాశ్ బాబును ఉన్నతాధికారులు నియమించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్‌ఛార్జ్ వైస్ చాన్సలర్లతో పరిపాలన కొనసాగిస్తున్నారు. యోగివేమన యూనివర్సిటీ నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ ప్రకాశ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ వీసీగా కొనసాగనున్నారు.

News February 18, 2025

కడప: జిల్లా వ్యాప్తంగా పోలీసుల పల్లెనిద్ర 

image

కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు ఉంటాయన్నారు

News February 18, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

image

నందలూరులో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకకు చెందిన టీడీపీ నేత కొమ్మినేని ప్రసాద్ (46) గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు, క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ ప్రతాప్ రాజు మంచి కార్యకర్తను కోల్పోయామన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

error: Content is protected !!