News April 2, 2025
పులివెందులలో యువకుల మధ్య ఘర్షణ

పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో మంగళవారం రాత్రి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కొద్దిసేపు యువకులంతా కొట్టుకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ నరసింహులు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. పట్టణంలో యువకులు మత్తు పానీయాలకు అలవాటు పడి రాత్రి సమయాల్లో గొడవకు పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News October 14, 2025
16న గండిక్షేత్రంలో వేలం

చక్రాయపేట మండలం గండిక్షేత్రం శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 16వ తేదీ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ ఆవరణలో టెంకాయల విక్రయాలు, వివాహాలు జరిపించడం, ఇతర కార్యక్రమాలకు డెకరేషన్ సప్లయర్స్కు సంబంధించి వేలం జరుగుతుంది. ఈ-టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం నిర్వహిస్తారు.
News October 14, 2025
ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి: కడప SP

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. అదనపు SP (అడ్మిన్) ప్రకాశ్ బాబు ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం చేయాలని పోలీసులు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 158 పిటీషన్లను చట్టం ప్రకారం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ పాల్గొన్న కార్యక్రమంలో ఫిర్యాదుదారులకు సిబ్బంది సహాయం చేశారు.
News October 14, 2025
తిప్పలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్కు అంతరాయం

ఎర్రగుంట్ల మండలం కమలాపురం వెళ్లే రహదారిలోని తిప్పలూరు వద్ద సోమవారం రాత్రి కంటైనర్ -లారీ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోగా అతనిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో రెండు లారీలు ఢీకొనడంతో రోడ్డుకు ఇరువైపుల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.