News September 23, 2024

పులివెందుల: అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ

image

పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్సీకి వివరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Similar News

News November 28, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో నిన్నటికి, ఈరోజుకు తేడా లేదు. వెండి స్వల్పంగా రూ.30లు పెరిగింది. ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము: రూ.12,590
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము: రూ.11,583
☛ వెండి 10 గ్రాములు: రూ.1680

News November 28, 2025

ప్రొద్దుటూరులో 10 మంది విద్యార్థులకు అస్వస్థత

image

ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తినడం వల్ల 10 మంది విద్యార్థులు తీవ్ర అస్తస్వతుకు గురయ్యారు. వడ్డించిన పప్పు దుర్వాసన వస్తుందని, బాగాలేదని మొదట తిన్న కొంత మంది విద్యార్థులు చెప్పడంతో ఆ పప్పును వడ్డించకుండా పక్కన పెట్టేశారు. కొద్దిసేపటికి ఆ 10 మందికి కడుపునొప్పి, వాంతులు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు ఆటోలో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 28, 2025

అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

image

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.