News September 23, 2024
పులివెందుల: అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్సీకి వివరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
Similar News
News October 11, 2024
కడప: ‘అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలి’
గ్రామోదయం, నగరోదయం కార్యక్రమాలలో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శివ శంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో గురువారం క్షేత్రస్థాయి అధికారులలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించినప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాలు ఏర్పడతాయని, అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.
News October 11, 2024
సిద్దవటంలో ఘోర రోడ్డు ప్రమాదం
సిద్దవటం మండలం మాధవరం ఎస్కే నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడపకు వెళుతున్న ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయ పడిన ఆటో డ్రైవర్, చిన్న పాపను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 10, 2024
రైల్వేకోడూరు: రేబీస్ వ్యాధితో మహిళ మృతి
ఉమ్మడి కడప జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. రైల్వే కోడూరు మండలం ఎ.బుడగుంటపల్లి పంచాయతీ వికాస్ నగర్‌కు చెందిన పులికి మునిలక్ష్మి(35)ని ఆమె పెంచుకున్న పెంపుడు కుక్క కాటేసింది. ఈక్రమంలో ఆమెకు రేబీస్ వ్యాధి సోకింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంపుడు, వీధి కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.