News August 2, 2024
పులివెందుల – కదిరి రహదారిపై ఘోర ప్రమాదం
పులివెందుల – కదిరి ప్రధాన రహదారిపై ఉదయం ఆటోని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనులు నిమిత్తం పులివెందుల ప్రాంత గ్రామాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. వీరంతా సత్య సాయి జిల్లా బట్రేపల్లి వాసులు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 13, 2024
చింతకొమ్మదిన్నె: బస్సులో నుంచి కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌లో నిలబడి ప్రయానిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కడప నుంచి పులివెందులకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మునీంద్రా అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం KSRM ఇంజనీరింగ్ కళాశాల వద్ద బస్సులో నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయం కాగా స్థానికులు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కి తరలించారు.
News October 13, 2024
ప్రొద్దుటూరు: దసరా వేడుకల్లో దారుణం
ప్రొద్దుటూరులో దసరా అమ్మవారి గ్రామోత్సవంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. సుధీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున కత్తితో పొడిచిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారిలో ఆందోళన నెలకొంది. సహాయం కోసం సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి, సుధీర్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.