News November 27, 2024
పులివెందుల: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన ఘటన పులివెందులలో చోటుచేసుకుంది. స్థానిక DSP మురళీ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉంటున్న యువతిని యస్వంత్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, చివరికి కులం పేరుతో దూషించాడని యువతి తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు అతణ్ని అరెస్ట్ చేశారు.
Similar News
News December 12, 2024
ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం
లింగాల మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న దేవరకోన వరదరాజుల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం చేశారు. ఆలయంలో హుండీని కాంక్రీటుతో పూడ్చి ఉండగా, కాంక్రీటును తొలగించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే హుండీని బలమైన ఇనుపతో తయారు చేయడంతో అది పగలకపోవడంతో పారిపోయారు. గతంలో కూడా హుండీని ఎత్తుకెళ్లి పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు.
News December 11, 2024
నువ్వు మనిషివేనా మోహన్ బాబు: టీజేఎఫ్ నేతలు
‘నువ్వు మనిషివేనా.. మోహన్ బాబు’ అని టీజేఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుండుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. టీవీ9, టీవీ5 జర్నలిస్టులపై నటుడు మంచు మోహన్ బాబు దాడిని టీజేఎఫ్ నేతలు ఖండించారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చెయ్యాలన్నారు.
News December 11, 2024
కడప జిల్లాలో తహశీల్దార్ సస్పెండ్
తిరుపతి జిల్లాలో MROగా విధులు నిర్వర్తిస్తున్న దస్తగిరయ్యను కడప జిల్లా జమ్మలమడుగు RDO కార్యాలయంలోని KRC తహశీల్దారుగా బదిలీ చేశారు. అధికారులు నిర్దేశించిన గడువులోగా ఆయన విధుల్లో చేరలేదు. ఉన్నతాధికారులు కాల్ చేసినా స్పందన లేదు. కలెక్టర్ రంగంలోకి దిగి నోటీసులు ఇచ్చినా డ్యూటీలో చేరలేదు. ఈక్రమంలో దస్తగిరయ్యను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ చెరుకూరి శ్రీదర్ ఉత్తర్వులు జారీ చేశారు.