News July 27, 2024

పులివెందుల బుడ్డోడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు

image

పులివెందుల పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ శరణ్య, డాక్టర్ నవీన్‌ల కుమారుడు తనయ్ సాయి అనే బుడతడు 18 నెలల వయస్సులోనే ఇండియా బుక్ రికార్డు సాధించాడు. దీనిపై తల్లిదండ్రులు, బంధువులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శరణ్య మాట్లాడుతూ.. 18 నెలల వయస్సులో 11 నిమిషాల 29 సెకండ్లలో 100 పదాలకు యాక్షన్ చేశాడని తెలిపారు.

Similar News

News November 21, 2025

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి కడప SP సాయం

image

కడపలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన AR హెడ్ కానిస్టేబుల్ నారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పోలీస్ సంక్షేమం కింద వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని మృతుడి సతీమణి రమాదేవికి శుక్రవారం అందించారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది మరణం బాధాకరమని ఎస్పీ పేర్కొంటూ, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

News November 21, 2025

ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

image

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్‌ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.

News November 21, 2025

కడపలో నేడు వాహనాల వేలం

image

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.