News September 1, 2024
పులివెందుల: మాజీ సీఎంకు సమస్యలు విన్నవించిన ప్రజలు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాత్రి పులివెందులలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దీంతో ప్రజలు ఆయనను చూడడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధి బాధితులు ఆయనను కలిసి తమ సమస్యలను తెలియజేశారు.
Similar News
News September 14, 2024
ఎర్రగుంట్ల: తండ్రి తాగొద్దని చెప్పినందుకు కొడుకు సూసైడ్
ఎర్రగుంట్లలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన చింతకుంట వెంకట్(18) రోజూ తాగి ఇంటికి వస్తుంటాడు. తన తండ్రి మందు తాగొద్దని మందలించేవాడని తెలిపారు. దీంతో శనివారం ఉదయం వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
ప్రొద్దుటూరు: ‘మా పాప మృతికి కారణం వైద్యులే’
ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి విషాదం నెలకొంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చాపాడు మండలం నక్కలదిన్నెకు చెందిన బాలఎల్లయ్య, సుమలతల కుమార్తె జసికాశ్రీ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. దీనికి కారణం చిన్నారి ఊపిరితిత్తిలో నిమ్ము ఎక్కువ అవ్వడమేనని వైద్యులు తెలిపారు. అయితే తమ పాప మృతికి కారణం వైద్యులే అని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.
News September 14, 2024
కడప: ‘17 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు’
అక్టోబర్ 2న ‘స్వచ్ఛ భారత్ దివస్’ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈనెల 17 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో, కార్యక్రమాలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మండలాల అధికారులతో వీసీ ద్వారా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లా “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.