News July 3, 2024
పులివెందుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పులివెందుల-ముద్దనూరు ప్రధాన హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. సైదాపురం మడూరు మార్గమధ్యంలో పులివెందుల వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా ముద్దనూరు నుంచి బూడిద ట్యాంకరు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 8, 2024
కడప: 10న ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాల్లో సేవలు
కడప డివిజన్ పరిధిలో జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా గురువారం అక్టోబర్ అంత్యోదయ దివాస్ సందర్భంగా ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కడప డివిజన్ పోస్టల్ ఇన్‌ఛార్జ్ రాజేశ్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు. కడపతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు ఉంటాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 8, 2024
మైదుకూరు: కాలువలో పడి బాలుడి మృతి
మైదుకూరు మండలం విశ్వనాథపురంలో కొట్టం సుజిత్ (14) అనే బాలుడు కాలవలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన సుజిత్ గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 8, 2024
కడప: ఆన్ లైన్ గేమ్.. యువకుడి ఆత్మహత్య
కడప జిల్లాలో ఆన్‌లైన్ గేమ్‌లో నగదు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బంధువుల వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బీఎన్ తాండాకు చెందిన కార్తీక్ నాయక్ గత కొంత కాలంగా అన్ లైన్ గేమ్ ద్వారా రూ.3 లక్షలు పొగుట్టుకున్నాడు. 2 రోజుల క్రితం కాలేటి వాగులో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇవాళ స్థానికులు గమనించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.