News March 23, 2025
పులివెందుల: వివేకా హత్య.. రంగంలోకి సిట్ బృందం

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ బృందం విచారణ చేపడుతోంది. అనుమానాస్పదంగా మృతి చెందిన సింహాద్రిపురం(M) కసనూరు (V)కు చెందిన కటిక రెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలిసింది. కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
Similar News
News March 31, 2025
అలా చేస్తే దక్షిణాదికి అన్యాయం: తులసి రెడ్డి

విజయవాడ బాలోత్సవ భవన్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని సరిదిద్దాలని కోరారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News March 31, 2025
రంజాన్ సందర్భంగా కడప జిల్లాలో భారీ బందోబస్త్

కడప జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ నేపథ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలోని బిల్డప్ సర్కిల్ సమీపంలోనీ ఈద్గా వద్ద సోమవారం భద్రతను ఎస్పీ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన భద్రతను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్ ఈద్గాల వద్ద ప్రజలకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: SP

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేశ్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.