News February 14, 2025
పులివెందుల : శ్రీ వెంకటరమణుడికి స్నపన తిరుమంజన సేవ

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందుల పట్టణంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి స్నపన తిరు మంజనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.
Similar News
News February 20, 2025
కడప జిల్లాలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

త్వరలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్ల చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమరావతి నుంచి సీస్ విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఇంటర్ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
News February 20, 2025
కడప: పకడ్బందీగా గ్రూప్-2 మెయిన్ పరీక్షలు

ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
News February 20, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

తిరుపతి రూరల్ మండలం, రామానుజపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఒకరు కడప జిల్లా, బురిడపల్లి గ్రామానికి చెందిన సాహిర్ బాషా కాగా, మరో యువతి పీలేరు, రామానాయక్ తాండాకు చెందిన బుక్కే యమునాగా పోలీసులు గుర్తించారు. యమునా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం పుత్తూరుకి వెళ్లి వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.