News April 12, 2025

పుల్కల్: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పుల్కల్ మండలం మిన్ పూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో పొలం వద్ద రైతు రమావత్ రమేష్(33) శుక్రవారం రాత్రి మృతి చెందారు. గాలి వాన బీభత్సం రావడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కరెంటు సరఫరా పునరుద్ధరించలేదని అధికారులు చెప్పడంతో రైతు రమేష్ శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లగా అక్కడే విద్యుత్ షాక్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ క్రాంతి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.

News November 18, 2025

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ విజేతలు వీరే..!

image

రాష్ట్రస్థాయి సీనియర్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా రెజ్లింగ్ జట్టు పలు క్యాటగిరీలో పతకాలు సాధించింది. 87కేజీల బాలుర విభాగంలో వెంకటప్రసాద్ వెండి, 53 కేజీల బాలికల విభాగంలో సంధ్య వెండి, 50కేజీల బాలికల విభాగంలో మానస కాంస్య పతకాలు గెలుపొందారు. పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడా అధికారి పరంధామ రెడ్డి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగ సీతారాములు అభినందించారు.

News November 18, 2025

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

image

ముంబైలోని <>జనరల్<<>> ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 ఆక్చువేరియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.