News April 12, 2025

పుల్కల్: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పుల్కల్ మండలం మిన్ పూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో పొలం వద్ద రైతు రమావత్ రమేష్(33) శుక్రవారం రాత్రి మృతి చెందారు. గాలి వాన బీభత్సం రావడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కరెంటు సరఫరా పునరుద్ధరించలేదని అధికారులు చెప్పడంతో రైతు రమేష్ శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లగా అక్కడే విద్యుత్ షాక్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ క్రాంతి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News April 17, 2026

ASF: మట్టి కుండ నీరే ఆరోగ్య ప్రదాయిని

image

ఆసిఫాబాద్ జిల్లాలోని పల్లెల్లో మట్టి కుండల వినియోగం క్రమంగా తగ్గుతుండటంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిజ్ నీటి కంటే కుండలో సహజంగా చల్లబడిన నీరే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా వేసవిలో వడదెబ్బ నుంచి రక్షిస్తుందని వివరిస్తున్నారు. కృత్రిమ పద్ధతులకు దూరంగా ఉండి, సహజమైన చల్లదనాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News April 17, 2026

HYDలో భారీ మోసం.. బాధితుల్లో ఎక్కువ వారే

image

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట సాగుతున్న మోసంపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారిక లోగోలను వాడుతూ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50వేల- రూ.లక్ష వరకు వసూలు చేశారు. 6 నెలల్లోనే ఈ తరహా మోసాలపై సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో 120కిపైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులే ఉండటం గమనార్హం.

News April 17, 2026

ఇంకా క్రేజీ రీల్స్ చేస్తా: అర్ష్‌దీప్

image

అర్ష్‌దీప్ సింగ్ IPLలో 100 వికెట్ల క్లబ్‌లో చేరిపోయారు. గ్రౌండ్‌లో నిప్పులు చెరిగే బాల్స్‌తో భయపెట్టే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. బయట మాత్రం ఫుల్ జోవియల్‌గా ఉంటారు. తనకు ఇన్‌స్టా రీల్స్ చేయడం అంటే ఇష్టమని, ఫ్యాన్స్ కూడా ఆటతో పాటు రీల్స్ చూసి బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. తన సోషల్ మీడియా క్రేజ్ వల్లే దేశమంతటా సపోర్ట్ లభిస్తోందని.. ఫ్యాన్స్ కోసం మరిన్ని క్రేజీ రీల్స్ చేస్తానని ప్రామిస్ చేశారు.