News January 8, 2025

పుల్లంపేటలోని శ్రీ సంజీవరాయస్వామికి పొంగళ్లు

image

పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్లు ఈ నెల 12వ తేదీ , సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం వైభవంగా జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు అయితే ఎక్కడైనా మహిళలు పొంగళ్లు పెట్టండం చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం పురుషులే పొంగళ్లు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ముందు రోజు రాత్రి నుంచే కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

Similar News

News January 8, 2026

మరో భారీ ఈవెంట్‌‌కు సిద్ధమవుతున్న జమ్మలమడుగు

image

జమ్మలమడుగు.. ఇక్కడ రాజకీయ రణరంగమే కాదు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్లను సైతం చేయగల సత్తా ఉన్న ప్రాంతం అని నిరూపిస్తోంది. ఈనెల 5 నుంచి ప్రారంభమైన 69వ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ పోటీలను సమర్థవంతంగా జమ్మలమడుగులోని అధికారులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు.

News January 8, 2026

ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడుతో ఏపీ ఫైట్

image

అండర్-14 బాలికల జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఫ్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు గెలిస్తే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జట్టు సభ్యులు కచ్చితంగా విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
>> ALL THE BEST TEAM AP

News January 8, 2026

ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడుతో ఏపీ ఫైట్

image

అండర్-14 బాలికల జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఫ్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు గెలిస్తే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జట్టు సభ్యులు కచ్చితంగా విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.