News July 27, 2024
పుల్లలచెరువు: ఆగి ఉన్న జేసీబీని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

పుల్లలచెరువు మండలంలోని కోమరోలు గ్రామ సమీపంలో శనివారం రాత్రి రహదారిపై ఆగి ఉన్న జేసీబీ వాహనాన్ని ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.