News February 14, 2025
పుల్వామా అమరులకు కోనసీమ చిత్రకారుడు చిత్రనివాళి

పుల్వామా ఘటనకు శుక్రవారంతో ఆరేళ్లు పూర్తి అయిన సందర్భంగా కాట్రేనికోనకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఆకొండి అంజి అమరులకు చిత్ర నివాళులర్పించారు. భారత్ మాతాకు జై అంటూ జవాన్ల చిత్రాలను గీసి గురువారం నీరాజనాలర్పించారు. ఎంతో మంది సైనికులను బలి గొన్న పుల్వామ బాంబ్ బ్లాస్ట్ భారతదేశంలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ గీచిన చిత్రాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
Similar News
News October 29, 2025
ప్రభుత్వ పాఠశాలలో ఎల్పిజి సిలిండర్ ద్వారా వంట: కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల ద్వారా వంట చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని, అన్ని పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ ద్వారానే మధ్యాహ్న భోజనానికి వంట చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇందుకోసం ఎల్పీజీ కనెక్షన్ ప్రతి పాఠశాలలో తీసుకునే విధంగా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రాబోయే నెల రోజుల్లో కనెక్షన్లు తీసుకునే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
News October 29, 2025
అజహరుద్దీన్‌కి మంత్రి పదవి: డీకే అరుణ స్పందన

కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే కాంగ్రెస్ ఎంతగా భయపడుతుందో మంత్రి పదవి ఇవ్వడంతో తెలుస్తుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయరాదన్న నిబంధన ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 29, 2025
భువనగిరి జిల్లాలో రేపు స్కూల్స్ బంద్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యజమానులు గమనించాలని సూచించారు.


