News June 18, 2024

పువ్వాడను కలిసిన మీడియా అకాడమీ ఛైర్మన్

image

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి సీపీఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును కలిశారు. ఆయన పువ్వాడ ఇంటికి వెళ్లి పువ్వాడ నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులను కలిసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇతరత్రా వ్యవహారాలపై కొద్దిసేపు ముచ్చటించారు. 

Similar News

News November 13, 2025

ఖమ్మం జిల్లాలో 52,260 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

image

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 326 కొనుగోలు కేంద్రాల ద్వారా 52,260 క్వింటాళ్ల నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. తల్లాడ, కల్లూరు మండలాల్లో 101 మంది రైతుల నుంచి సేకరించిన 5,134 క్వింటాళ్ల సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌గా రూ.25.67 లక్షలు 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు.

News November 13, 2025

దానవాయిగూడెం గురుకులంను మోడల్‌గా మారుస్తాం: పొంగులేటి

image

దానవాయిగూడెం టీ.జీ.ఎస్.డబ్ల్యు.ఆర్ బాలికల గురుకులాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాఠశాల, కళాశాల భవన మరమ్మతులకు రూ.3.80 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భవన మరమ్మతులు, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్లు, క్రీడా మౌలిక వసతుల పనులకు మంత్రి కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అధికారులు పాల్గొన్నారు.

News November 12, 2025

87% బిల్లులు డిజిటల్‌తోనే: ఖమ్మం ఎస్ఈ

image

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.