News January 25, 2025

పుష్కరాల పనులు పూర్తి చేయాలి: BHPL కలెక్టర్

image

ఏప్రిల్ 30 వరకు సరస్వతి పుష్కారాల పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో సరస్వతి పుష్కారాలు, ఫిబ్రవరిలో నిర్వహించనున్న కుంభాభిషేకం కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా పుష్కారాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News December 4, 2025

జడ్చర్ల: విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు..!

image

జడ్చర్ల మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళ వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో షి టీం ఆధ్వర్యంలో నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తుండగా విద్యార్థిని పోలీసులకు తెలిపింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ నిర్వహించి వైస్ ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశారు.

News December 4, 2025

KMM: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

image

స్థానిక ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఏకంగా సొంత అక్కాచెల్లెళ్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో చిట్టూరి రంగమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా మల్లెంపుడి కృష్ణకుమారి బరిలో ఉన్నారు. వీరిద్దరూ కలిసిమెలిసి ఉన్నవారే కావడంతోపాటు కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. కాగా ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందోనని మండలంలో చర్చ జరుగుతోంది.

News December 4, 2025

పాలమూరు: సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ

image

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైద్య విద్యార్థిని కే.ఎన్. నిఖిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నామినేషన్ వేశానని.. గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కాగా ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలోని యువత సైతం అభినందిస్తున్నారు.