News April 16, 2025
పుష్కరాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి నదీ పుష్కరాల పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, వివిధ శాఖ అధికారుల సమక్షంలో పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 13, 2025
జగిత్యాల: ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక

జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 400–600 చదరపు అడుగుల్లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. బిల్లుల్లో జాప్యాలు, సమస్యలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మేస్త్రి, కూలీల కొరత లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని తెలిపారు.
News October 13, 2025
పిల్లలకు వాడకూడని 3 వస్తువులు

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT
News October 13, 2025
NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.