News July 6, 2024
పుష్పగుచ్ఛాలు వద్దు.. పుస్తకాలు తీసుకురండి: నారా లోకేశ్
తనను కలిసేందుకు వస్తున్న వారంతా పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకురావొద్దని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా నోటుపుస్తకాలు, డిక్షనరీలు, లైబ్రరీ పుస్తకాలు ఇస్తే ఎంతో సంతోషిస్తానని తెలిపారు. తన దగ్గరకు వచ్చేవారు ఏమీ తేవద్దని.. తేవాలని భావిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పనికొచ్చే పై వస్తువులను తీసుకురావాలని ఆయన కోరారు.
Similar News
News December 11, 2024
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అంబటి రాంబాబు
కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. పలువురు రైతులతో ధాన్యం కొనుగోలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు లేవని, తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోవాల్సి వస్తుందని అంబటి విమర్శించారు.
News December 10, 2024
వైసీపీ రైతు ఉద్యమం పోస్టర్ విష్కరణ
ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఉద్యమం పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర నేతలు పిలుపునిచ్చారు.
News December 10, 2024
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి కంచె తొలగింపు
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటికి రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెలో కొంత భాగాన్ని సోమవారం తొలగించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో భద్రత కోసం తాడేపల్లిలోని తన ఇంటి ప్రహరీ గోడకు భారీ ఎత్తున ఇనుప కంచెను ఏర్పాటు చేయించుకున్నారు. వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్య వైపు కంచె భాగాన్ని తొలగించినట్లు సమాచారం.