News August 27, 2024

పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు

image

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత.. విజయనగరం వాసులు కొంగు బంగారం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Similar News

News December 9, 2025

VZM: జిల్లాలోని ఆప్కో దుకాణాల్లో పండగ ఆఫర్లు

image

క్రిస్మస్‌, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సాహించాలన్నారు.

News December 9, 2025

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురికి జైలుశిక్ష: VZM SP

image

విజయనగరం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. పట్టుబడ్డవారిని కోర్టులో హాజరుపర్చగా.. ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి 20, 15, 6, 5 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ఆకస్మిక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ దామోదర్ చెప్పారు.

News December 9, 2025

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హమీ పథకం కీలకం: మంత్రి కొండపల్లి

image

MGNREGS పనుల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఛాంబర్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పథకం కీలకమని ఆయన పేర్కొన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్థితిని అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పీడీ శారదాదేవి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రత్నకుమార్, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.