News August 27, 2024
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత.. విజయనగరం వాసులు కొంగు బంగారం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Similar News
News September 12, 2024
విజయనగరం: JNTUలో సైబర్ నేరాల నియంత్రణపై సెమినార్
సైబర్ నేరాల నియంత్రణపై విజయనగరం JNTUలో మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ సెమినార్ బుధవారం ప్రారంభం అయింది. సెమినార్‌ను జైపూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పి.అరుణకుమారి ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణకు టెక్నాలజీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్ మోసాలను ఎలా నియంత్రించాలో ఆచరణాత్మక పద్ధతిలో విద్యార్థులకు వివరించారు.
News September 11, 2024
‘పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ రైలు నడపాలి’
పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ ట్రైన్ నడపాలని సీపీఎం బొబ్బిలి పట్టణ కార్యదర్శి పి.శంకర్రావు డిమాండ్ చేశారు. పార్వతీపురం, బొబ్బిలి నుంచి విజయనగరం, విశాఖకు విద్యార్థులు, ఉద్యోగస్థులు, వైద్యం కోసం ప్రతీ రోజూ వేలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారన్నారు. కానీ, సరిపడా ట్రైన్లు లేవన్నారు. ఉన్న ఒకటి రెండు రైళ్లలో కిక్కిరిసి, ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారన్నారు.
News September 11, 2024
విజయనగరం జిల్లాలో పశువుల అక్రమ రవాణా..!
కొత్తవలస మండల కేంద్రంలోని సంతపాలెంలో పశువులను అక్రమంగా నిర్బంధించిన గోడౌన్‌పై సీఐ షణ్ముఖరావు మంగళవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా తరలించేందుకు ఉంచిన 108 పశువులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గొటివాడ ఎర్రిబాబు, గొటివాడ నవీన్, ఐ.దేవుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.