News December 5, 2024

పుష్ప-2పై విశాఖ జనసేన నేత ట్వీట్

image

పుష్ప-2 హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో విశాఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డులు సృష్టిస్తోన్న పుష్ప-2 బెనిఫిట్ షోలు వేసుకొనడానికి అనుమతిచ్చిన ప్రభుత్వాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన, చేస్తున్న కృషి.. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్థికంగా తన స్థాయిని పెంచడానికి దోహదపడుతుంది. YCP ప్రభుత్వం ఉంటే నిర్మాతలతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి పడేది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 24, 2026

సర్క్యులర్ ఎకానమీతో 10 మిలియన్ల ఉద్యోగాలు: పట్టాభిరామ్

image

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడారు. 2050 నాటికి సర్క్యులర్ ఎకానమీ ద్వారా 10 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు, వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేంధీర ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించగా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు.

News February 24, 2026

విశాఖ పోలీసుల అదుపులో క్రిప్టో కరెన్సీలో కేసులో కీలక సూత్రధారి

image

క్రిప్టో కరెన్సీ పేరుతో విశాఖలో వందల కోట్లు వసూలు చేసిన కీలక సూత్రధారుడుని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు సోమవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు PGRSలో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.రవి కిరణ్ తప్పు చేయలేదని సీఐ భవానీ ప్రసాద్ వాదిస్తుండగా.. బాధితులు మాత్రం మేము అతనికే సొమ్ము చెల్లించామని ఆధారాలు చూపిస్తున్నారు.

News February 24, 2026

రక్షణ రంగ అభివృద్ధికి ఏపీ కీలకం: జి. సతీష్ రెడ్డి

image

విశాఖ డిఫెన్స్ స్టార్టప్ సదస్సులో రక్షణ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తీరప్రాంతం, పారిశ్రామిక వసతులు రాష్ట్రానికి బలమని, స్టార్టప్స్ భాగస్వామ్యంతో అధునాతన పరికరాల తయారీ సాధ్యమని చెప్పారు. సముద్ర భద్రతే దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభమని, స్వదేశీ సాంకేతికతతో ఇండో-పసిఫిక్‌లో భారత ప్రయోజనాలను కాపాడవచ్చని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పేర్కొన్నారు.