News December 6, 2024

పుష్ప-2 రీసెర్చర్‌గా కడప జిల్లా వాసి

image

పుష్ప-2లో కడప జిల్లా వాసి కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన వీరా కోగటం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఈక్రమంలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ డైరెక్టర్‌ సుకుమార్‌ను కలిశారు. ఆ పరిచయంతో పుష్ప-2 ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. స్ర్కిప్ట్ కల్చర్, రీసెర్చర్‌గానూ వ్యవహరించారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

Similar News

News September 19, 2025

22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

image

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.

News September 19, 2025

కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

News September 19, 2025

వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

image

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.