News August 27, 2024
పుస్తకానికి ముందుమాట రాసిన అశోక్ గజపతిరాజు
‘స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా’ అనే టైటిల్‌తో డా.పీవీజీ రాజుపై విడుదలైన పుస్తకం ఆకట్టుకుంటోంది. కవర్ పేజీ చిత్రపటం నుంచి చివరి పేజీ వరకు పీవీజీ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘటనలు, విశేషాలను ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. అశోక్ గజపతిరాజు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. ఈ తెలుగు అనువాద పుస్తకం సుమారు 8 వేల కాపీలను అచ్చు వేయించారు. సోమవారం సాయంత్రం కోటలో పుస్తకావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News September 18, 2024
VZM: భర్త ఏడేళ్ల జైలు శిక్ష.. భార్యకు జరిమానా
డెంకాడ పోలీసు స్టేషనులో 2020లో నమోదైన హత్య కేసులో చింతలవలస గ్రామానికి చెందిన మోపాడ అప్పల నాయుడుకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, అతడి భార్య శాంతికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం మహిళా కోర్టు తీర్పు వెల్లడించినట్లు భోగాపురం సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఇంటి స్థలం విషయమై 2020లో జరిగిన ఘర్షణలో అదే గ్రామానికి చెందిన పోలిపల్లి ఉమా అనే మహిళ మృతికి నిందితులు కారణమయ్యారు.
News September 17, 2024
మోదవలసలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు
డెంకాడ మండలం మోదవలస సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన <<14120812>>విషయం తెలిసిందే<<>>. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలను వెల్లడించారు. విజయనగరం 1-టౌన్‌కు చెందిన నమ్మి మనోజ్ (27), తగరపువలసకు చెందిన అలమండ శ్యాంప్రసాద్ (33) తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
News September 17, 2024
మోదవలస వద్ద ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
విశాఖ నుంచి విజయనగరం వెళ్లే రోడ్డు మార్గంలో మోదవలస వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.