News April 1, 2025
పుస్తకాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే: RSP

ఎస్సీ సబ్ ప్లాన్ కింద రావాల్సిన రూ.35,000 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదని BRS నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. HYD పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామాంతపూర్‌లో పేద దళిత, గిరిజన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని అడిగితే నిధులు లేవని అనటం, ప్రభుత్వం నిర్లక్ష్యమని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 10, 2026
తుర్కపల్లి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఆరుగురు అరెస్ట్

మాదాపూర్ గ్రామ శివారులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్సై తక్యుద్దీన్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక హిటాచీ, కారు, పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 10, 2026
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..! సమాచారం ఇవ్వండి- ఎస్పీ

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని విలువైన వస్తువులు లాకర్ల లోనే భద్రపరుచుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి విజ్ఞప్తి చేశారు. పండుగకు ఊర్లకు వెళ్తారని ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే పెట్రోలింగ్‌లో భాగంగా ఆయా ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని అన్నారు.
News January 10, 2026
పుతిన్‌నూ అదుపులోకి తీసుకుంటారా?.. ట్రంప్ సమాధానమిదే!

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను <<18751661>>అదుపులోకి<<>> తీసుకుని అమెరికా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా పట్టుకోవాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘అలా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అని బదులిచ్చారు. పుతిన్‌తో తనకు మంచి రిలేషన్ ఉందని చెప్పారు. కానీ ఆయన విషయంలో నిరాశకు గురయ్యానని అన్నారు.


