News October 15, 2024

పూడికతీత పనులను పరిశీలించిన అనంతపురం కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ డా.వినోద్ కుమార్ పర్యటించారు. నగరంలోని రజాక్ నగర్, సోమనాథ్ నగర్, ఐదు, ఆరో రోడ్లలో, యువజన కాలనీ, నారాయణ కళాశాల, త్రివేణి టాకీస్, అశోక్ నగర్ బ్రిడ్జి, ఎంజీ కాలనీ, ఖాగానగర్, హౌసింగ్ బోర్డుల్లో ఉన్న నడిమివంక, మరువవంకలో పూడికతీత పనులను పర్యవేక్షించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Similar News

News November 8, 2024

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

image

ఏపీలో ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరం లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2024

ఎస్సీ, ఎస్టీల ఉచిత డీఎస్సీ స్క్రీనింగ్ ఆన్‌లైన్ పరీక్ష వాయిదా

image

ఈనెల 10న జరగాల్సిన ఎస్సీ, ఎస్టీల ఉచిత డీఎస్సీ స్క్రీనింగ్ ఆన్‌లైన్ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల పరీక్ష వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తరువాత పరీక్ష తేదీని తెలియజేస్తామన్నారు.

News November 8, 2024

అనంతపురం జిల్లాలో 16 మందికి ఏఈవోలుగా పదోన్నతి

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 16మందికి ఏఈవోలుగా ఉద్యోగోన్నతి కల్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. గోరంట్ల, తనకల్లు, bk సముద్రం, కుందుర్పి, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, పామిడి, ఆమడగూడూరు, బత్తలపల్లి, పరిగి, కనేకల్, శింగనమల, విడపనకల్లు, వజ్రకరూరు, ముదిగుబ్బ, రామగిరికి వారిని కేటాయించామన్నారు.