News November 28, 2024

పూడిమడకలో ఫిషింగ్ హార్బర్.!

image

అనకాపల్లి జిల్లాలో పోర్టు నిర్మించబోతున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్ ఉండగా పోర్టుల అభివృద్ధి, ప్రైవేట్ రంగాల ప్రోత్సాహకానికి అనుగుణంగా ఏపీ మారిటైం పాలసీ తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని ప్రకటించారు. ఇదే జరిగితే జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

Similar News

News December 11, 2024

విశాఖ: రద్దీ కారణంగా పలు స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డిసిఎం కె సందీప్ పేర్కొన్నారు. త్రివేండ్రం నార్త్-షాలిమార్ కొచ్చువేలి స్పెషల్ ట్రైన్ వచ్చే నెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే తిరునల్వేలి-షాలిమార్-తిరునల్వేలి ప్రత్యేక రైలు, పొదనూర్-బరౌని పొదనూర్ స్పెషల్ ట్రైన్, తాంబరం-సంత్రగచ్చి-తాంబరం స్పెషల్ పొడిగించామన్నారు.

News December 11, 2024

అనకాపల్లి: గోడకూలి ఇద్దరు మృతి

image

మాకవరపాలెం మండలం కోడూరులో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వేగి పైడమ్మ ఇంటి వద్ద రోజూ స్థానికులు కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ గోడవద్ద మాట్లాడుకుంటున్న కోయిలాడ కాంతం(73), వేడి భీముడు(70) లపై గోడ కూలిపోయింది. దీంతో కాంతం అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ భీముడును 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 11, 2024

విశాఖ: ‘జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇబ్బందులు పెట్టేది’

image

విశాఖ హనిట్రాప్ కేసులో బాధితుడి తల్లి మంగళవారం విశాఖలో ప్రెస్‌మీట్ పెట్టింది. తమ బిజినెస్ ప్రోమోట్ చేస్తానని జాయ్ జమియా తన కుమారిడితో పరిచయం పెంచుకుందని తెలిపింది. అమెరికా నుంచి అతనిని వైజాగ్‌కి రప్పించిన ఆమె.. జ్యూస్‌లో మత్తు మందు కలిపి పెట్టిన ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తమకు తెలియజేశాడని పేర్కొంది. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని కేసును లోతుగా విచారించాలని పోలీసులను కోరింది.