News March 22, 2025
పూడూరు: వారికి గుడ్ న్యూస్ చెప్పిన కలెక్టర్

పూడూరు మండల జాతీయ రహదారి పక్కన హైవేపై 20 ఎకరాల స్థలాన్ని చిరు వ్యాపారులకు అందించాలని వికారాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు 20 ఎకరాల స్థలం కోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు నగరాలకు వెళ్లి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతులకు స్థలం కేటాయిస్తే వారి వ్యాపారం వారే చేసుకోవచ్చు.
Similar News
News October 16, 2025
రిజర్వేషన్లు 50% మించొద్దనడం సరికాదు: సింఘ్వీ

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తక్షణం జోక్యం చేసుకోవాలని TG తరఫున సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచామని, రిజర్వేషన్లు 50 శాతం మించరాదనడం సరికాదని వాదించారు.
News October 16, 2025
మద్దూరు: సంకంచెరువులో వ్యక్తి మృతి

మద్దూరు పట్టణ కేంద్రంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంకంచెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడి చేరుకొని మృతుడిని వెలికి తీసే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 16, 2025
ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.