News April 3, 2024
పూతలపట్టులో ముగిసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ

పూతలపట్టులో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షలపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం బస్సు యాత్ర పి.కొత్తకోట, పాకల క్రాస్, గదంకి, పనపాకం, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.
Similar News
News October 26, 2025
చిత్తూరు: వైద్య సిబ్బందికి సెలవులు లేవు

భారీ వర్ష సూచనల నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు లేవని డీఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు. ఆదివారం జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సోమ, మంగళ వారాల్లో కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
News October 25, 2025
చిత్తూరు: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు.!

రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, కుంటల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
News October 25, 2025
కోడి తెచ్చిన తంటా.. ఎనిమిది మందిపై కేసులు

కోడి తెచ్చిన తంటా.. పుంగనూరులో ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. SI రమణ వివరాల మేరకు.. పట్టణంలోని రహ్మత్ నగర్లో పక్కపక్కనే భాస్కర్ నాయుడు, ఖాదర్ వలీ కుటుంబాలు ఉంటున్నాయి. భాస్కర్కు చెందిన కోడి ఖాదర్ వలీ ఇంటి వద్ద ఇది వరకు రెట్ట వేయడంతో గొడవ పడ్డారు. శుక్రవారం మరోసారి ఇదే రిపీట్ కావడంతో ఇరుకుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు SI తెలిపారు.


