News July 3, 2024
పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
పూరి జగన్నాధుడి రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యానికి అన్‌రిజర్వుడ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే సందీప్ తెలిపారు. విశాఖ-పూరి(08347) ప్రత్యేక రైలు ఈనెల 6,14,16 తేదీల్లో మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రికి పూరి చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరిగి పూరి-విశాఖ(08348) రైలు 8,16,18 తేదీల్లో తెల్లవారుజామున 1.45 గంటలకు పూరిలో బయలుదేరుతుందని తెలిపారు.
Similar News
News December 11, 2024
గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.
News December 11, 2024
గజపతినగరం: చికిత్స పొందుతూ మహిళ మృతి
గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేట్ సమీపంలో నవంబర్ 29న మరుపల్లికి చెందిన స్నేహితులు సీర పైడిరాజు, చవుకు రామలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పైడిరాజు 30వ తేదీన చనిపోగా.. రామలక్ష్మి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
News December 11, 2024
VZM: ఆరు నెలల ప్రగతిపై మీ కామెంట్?
నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబుతో జరిగే సదస్సులో పార్వతీపురం, విజయనగరం కలెక్టర్లు అంబేడ్కర్, శ్యాంప్రసాద్ పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం. మరి ఈ ఆరు నెలల వ్యవధిలో పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లోని మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై మీ కామెంట్.