News November 28, 2024
పూర్తైన ఫ్లైఓవర్ పనులు.. మరింత వేగంగా హైదరాబాద్‌కు రాకపోకలు
విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిలో భాగమైన ప్రధాన ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కృష్ణా నదిపై సూరయపాలెం-వెంకటపాలెం మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు ఫినిషింగ్ పనులు, బీటీ రోడ్ నిర్మించాల్సి ఉంది. ఈ వంతెన పూర్తై బైపాస్ రహదారి అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ రాకుండా జాతీయ రహదారిపైకి వెళ్లవచ్చు. దీంతో విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Similar News
News December 11, 2024
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 22 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. గీతాబాయి తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 16లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News December 11, 2024
కృష్ణా: వెన్నెల AC స్లీపర్ సర్వీసును ఆదరించండి
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి ప్రతి రోజూ విశాఖపట్నంకు వెన్నెల AC స్లీపర్ బస్సు నడపుతున్నామని RTC తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 11 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, విశాఖలో రాత్రి 10.45కి బయలుదేరి తర్వాత రోజు ఉదయం 05.35కి విజయవాడ వస్తుందని, ఈ సర్వీసును ప్రజలు ఆదరించాలని RTC అధికారులు విజ్ఞప్తి చేశారు.
News December 11, 2024
కృష్ణా: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్(థియరీ) పరీక్షలను 2025 జనవరి 22 నుండి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.