News March 10, 2025

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

image

వడ్డాది కేఏడీ జడ్పీ హైస్కూల్లో 2008-09 విద్యా సంవత్సరంలో టెన్త్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 16 ఏళ్ల తరువాత ఆదివారం కలిశారు. విద్య, ఉద్యోగ, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా చదువుకున్న హైస్కూల్లో సమావేశమై నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆటపాటలతో రోజంతా ఉల్లాసంగా గడిపారు. చదువు చెప్పిన గురువులను సత్కరించారు.

Similar News

News March 25, 2025

ఏటీఎం ఛార్జీల పెరుగుదల.. ఎప్పటినుంచంటే..

image

ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు పెరగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5సార్లు, నాన్ మెట్రో ప్రాంతాల్లో 3సార్లు ప్రతి నెలా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మే 1 నుంచి ఆ పరిధి దాటితే డబ్బు విత్‌డ్రాకు ఇప్పుడున్న రూ.17 నుంచి రూ.19కి, బాలెన్స్ చెకింగ్‌కు ఇప్పుడున్న రూ.6 నుంచి రూ.7కి ఛార్జీలు పెరగనున్నాయి.

News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

వికారాబాద్: మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మోమిన్పేట్ మండలం మొరంగపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకాని నరేశ్ (24), మంగలి సన్నీ (22) ప్రాణస్నేహితులు. అవసర నిమిత్తం మోమిన్పేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మొరంగపల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!