News April 12, 2025
పూలే గొప్ప సంఘ సంస్కర్త: నంద్యాల కలెక్టర్

దళితులు, మహిళలు ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్తని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం 199వ జయంతి సందర్భంగా.. నంద్యాలలోని పద్మావతి నగర్ సమీపంలో ఉన్న పూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కుల, మత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహనీయుడన్నారు.
Similar News
News November 18, 2025
సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
News November 18, 2025
బస్సుకు మంటలు.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్

AP: నెల్లూరు జిల్లా సంగం హైవేపై పెను ప్రమాదం తప్పింది. 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద మంటలు చెలరేగాయి. అదే రోడ్డుపై వెళ్తున్న సంగం కానిస్టేబుల్ నాగార్జున వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన కానిస్టేబుల్‌ను అభినందించారు.
News November 18, 2025
సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి: ఎస్పీ

ప్రతి కేసులో దర్యాప్తు నాణ్యమైన చేయాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యక్రమంలో నేర సమీక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. ఎస్హెచ్ఓలు తమ ఏరియాలో గల ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రాంతాలలో గల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు.


