News April 12, 2025
పూలే గొప్ప సంఘ సంస్కర్త: నంద్యాల కలెక్టర్

దళితులు, మహిళలు ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్తని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం 199వ జయంతి సందర్భంగా.. నంద్యాలలోని పద్మావతి నగర్ సమీపంలో ఉన్న పూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కుల, మత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహనీయుడన్నారు.
Similar News
News February 12, 2026
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు షుగర్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటాయి. వీటిని గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News February 12, 2026
NLG: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత!

నల్గొండ జిల్లా 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
News February 12, 2026
నిర్మల్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ఆత్మహత్య చేసుకుంది. భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


