News July 7, 2024
పెంచికల్పేట్లో బొలెరో బోల్తా.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచికల్పేట్లోని మురళిగూడ వద్ద గుట్ట ఎక్కుతున్న క్రమంలో బొలెరో బోల్తా పడింది. అందులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెజ్జూర్ నుంచి సిమెంట్, రేకులు, సిలెండర్లతో పాలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు, తల్లిదండ్రులతో వాహనం గ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో గుట్ట ఎక్కుతుండగా బొలేరో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
Similar News
News September 19, 2025
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్కు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.
News September 19, 2025
తలమడుగు: కలప అక్రమ రవాణా

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.