News March 23, 2025
పెంచికల్పేట్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: MLC

మారుమూల గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని MLC దండే విఠల్ పేర్కొన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లకు ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, దారుగపల్లి, చేడువాయి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News November 13, 2025
స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. 2,3 రోజుల్లో క్లారిటీ

TG: రేపటితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగియనుండటంతో లోకల్ బాడీ ఎలక్షన్స్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై 2,3 రోజుల్లో CM రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా వ్యాఖ్యానించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. రిజర్వేషన్లను కోర్టు అంగీకరించకపోతే పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లనుంది.
News November 13, 2025
జూబ్లీహిల్స్: రేపు వైన్స్ బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని అధికారులు మరోసారి గుర్తు చేశారు. వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లు మూసివేయాలని ఆదేశించారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వైన్స్ తెరుచుకోనున్నాయి. SHARE IT
News November 13, 2025
అమలాపురం: వ్యభిచార గృహంపై దాడి

అమలాపురంలో పట్టాభి స్ట్రీట్లో ఓఇంట్లో వ్యభిచారం సాగుతోందని పోలీసులు గుర్తించారు. కొంతమంది అండతో పాయసం వెంకట రమణ ఇద్దరు అమ్మాయిలతో ఈ వ్యాపారం నిర్వహిస్తోందని సమాచారంతో సీఐ వీరబాబు బుధవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు నలుగురు విటులు అదుపులోకి తీసుకోగా, 2 వేల నగదు, 5 కండోమ్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు టౌన్ సీఐ వీరబాబు గురువారం తెలిపారు.


