News December 24, 2024

పెంచికల్పేట్: బాబోయ్ మళ్లీ పెద్దపులి కదలికలు?

image

కొమురం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి శివారు ప్రాంతంలోని ఎర్రగుంట సమీపంలో మళ్లీ పెద్ద పులి కనిపించినట్లు రైతులు పేర్కొన్నారు. పాలఓర్రే, మంగలి కుంట, కుమ్మరి కుంట, కంట్లం దారి, నక్కచెలీమ, లోడపల్లి కెనాల్ ఏరియా, లోడపల్లి ఎర్ర వాగు చెరువు ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తుందని తెలిపారు. కావున గ్రామ ప్రజలు అటవీలోకి వెళ్లారాదని. అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News December 25, 2024

ADB: ‘వాజ్ పేయ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ నగేశ్’

image

రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగేశ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ పుట్టినరోజును సుపరిపాలన దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

News December 25, 2024

ADB: సమగ్ర శిక్ష ఉద్యోగులకు తుడుందెబ్బ మద్దతు

image

టీపీసీసీ అధ్యక్ష హోదాలో వరంగల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆదివాసీ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.

News December 25, 2024

ఆదిలాబాద్: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?