News March 16, 2025

పెంచికల్పేట్‌: వన్యప్రాణుల వేట.. నలుగురి అరెస్ట్

image

వన్యప్రాణుల వేటగాళ్లను శనివారం పెంచికల్పేట్ డీఆర్ఓ జమీర్ పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆగర్ గూడా అటవీలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అధికారులకు కొంతమంది అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. వారిని పట్టుకొని విచారించగా ఆగర్గూడా అటవీలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చినట్లు నలుగురు అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు.

Similar News

News November 6, 2025

ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

image

తాలిబన్స్‌తో ఓ టీ మీట్‌తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్‌లోకి వచ్చారన్నారు. వారితో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.

News November 6, 2025

బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.

News November 6, 2025

వరంగల్ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ డా. సత్యశారదా దేవి గురువారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ని సందర్శించారు. ఆమె మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 5తేదీలోపు తమ సమస్యల పరిష్కరించకపోతే పత్తి కొనుగోలు చేయమని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో వారితో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.