News March 4, 2025

పెంచికల్పేట్: వివాహిత హత్య.. భర్తపై అనుమానం!

image

పెంచికల్పేట మండలం లోడ్పల్లి గ్రామానికి చెందిన <<15640043>>లలిత<<>>(35) సోమవారం హత్యకు గురైంది. ఘటనపై కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంలో విచారణ చేపట్టినట్లు CI శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా తన అల్లుడు గణేశ్ కొన్ని రోజులుగా తన కూతురిని వేధిస్తున్నాడని, అతడే లలితను హత్య చేశాడని మృతురాలి తల్లి తాను బాయి ఫిర్యాదు చేసిందన్నారు.

Similar News

News March 4, 2025

మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. డీఆర్డీఏ పరిధిలోని సమస్యలు గుర్తించి.. వాటిని పరిష్కరించేలా అడుగులు వేయాలన్నారు.  

News March 4, 2025

BREAKING: భువనగిరిలో రోడ్డెక్కిన మహిళలు

image

భువనగిరి మండలం హనుమాపురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఆరోపించారు. భువనగిరి-జగదేపూర్ ప్రధాన రహదారిలోని హనుమపురం చౌరస్తా వద్ద మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవాలని కోరారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు తాగునీటి ఎద్దడి తీవ్రతను అరికట్టలేకపోతున్నారని వారు మండిపడ్డారు. 

News March 4, 2025

జీడిమెట్ల సీఐకి స్మార్ట్ పోలీసింగ్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు

image

ఢిల్లీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలీసింగ్ అవార్డుకు తెలంగాణ నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డును సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల CI మల్లేశ్ అందుకున్నారు. దేశవ్యాప్తంగా 129 రాష్ట్రాల పోలీస్ విభాగాలతో పాటు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ నుంచి కూడా పోటీపడ్డారు. అనంతరం తెలంగాణ డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!