News January 29, 2025

పెంచికల్ పేట్ అటవీ రేంజ్‌లో బర్డ్ వాక్ ఫెస్టివల్

image

ఒకవైపు ప్రాణహిత మరోవైపు పెద్దవాగు అందాల నడుమ పాలరపు గుట్టపై నెలవైన పొడవు ముక్కు రాబందుల స్థావరం బర్డ్ వాక్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎల్లూరు బొక్కివాగు ప్రాజెక్టు, కొండెంగల లొద్ది, బోల్ మెత్తం, రాగి చెట్టు మడుగు ప్రాంతాల్లో రకరకాల పక్షుల అందాలను తిలకించేందుకు ఆస్కారం ఉంది. ఇది వరకు నిర్వహించిన 3 విడతల్లో దాదాపు నాలుగు వందల రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 28, 2025

కాశీకి వెళ్లలేకపోయినా.. ఈ శివాలయాలకు వెళ్లవచ్చు

image

మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా కాశీ వెళ్లి తీరాలని మన శాస్త్రాలు చెబుతాయి. అయితే కాశీ వెళ్లడం సాధ్యం కానప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పండితులు అంటున్నారు. కాశీతో సమానమైన శక్తి ఉన్న 4 కాశీ క్షేత్రాలు ఉన్నాయంటున్నారు. వీటిలో ఏ క్షేత్రాన్ని దర్శించినా కాశీ యాత్ర ఫలం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 1. కేదార క్షేత్రం 2. శ్రీశైలం 3. శ్రీకాళహస్తి 4. పట్టిసము (పట్టిసీమ).

News November 28, 2025

VKB: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

image

వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చేవెళ్ల-శంకర్‌పల్లి రూట్‌లో ఒక ప్రయాణికురాలు తన బ్యాగును మర్చిపోయింది. అందులో సుమారు రూ.2 లక్షల నగదు ఉంది. ఈ బ్యాగును గుర్తించిన కండక్టర్ మీనా, వెంటనే పోగొట్టుకున్న మహిళకు డబ్బును తిరిగి ఇచ్చారు. కండక్టర్ మీనా నిజాయితీని పలువురు ప్రశంసించారు.

News November 28, 2025

నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.