News January 29, 2025
పెంచికల్ పేట్ అటవీ రేంజ్‌లో బర్డ్ వాక్ ఫెస్టివల్

ఒకవైపు ప్రాణహిత మరోవైపు పెద్దవాగు అందాల నడుమ పాలరపు గుట్టపై నెలవైన పొడవు ముక్కు రాబందుల స్థావరం బర్డ్ వాక్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎల్లూరు బొక్కివాగు ప్రాజెక్టు, కొండెంగల లొద్ది, బోల్ మెత్తం, రాగి చెట్టు మడుగు ప్రాంతాల్లో రకరకాల పక్షుల అందాలను తిలకించేందుకు ఆస్కారం ఉంది. ఇది వరకు నిర్వహించిన 3 విడతల్లో దాదాపు నాలుగు వందల రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 14, 2025
పెద్దపల్లి: మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ చర్యలపై సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బాలల సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు 1098 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లలో స్పాన్సర్షిప్‌కు అర్హులైన పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు.
News February 14, 2025
ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1974: సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్ర రావు మరణం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం
News February 14, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 14, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.