News January 29, 2025
పెంచికల్ పేట్ రేంజ్లో బర్డ్ వాక్ ఫెస్టివల్

కొమIరం భీమ్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ పెంచికల్ పేట్ అటవీ శాఖ రేంజ్లో ఫిబ్రవరి 2న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు డీఎఫ్‌వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందులో పాల్గొనేందుకు పక్షి ప్రేమికులు రూ.1500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జంగిల్ సఫారి, రవాణా భోజన వసతి కల్పిస్తామన్నారు.
Similar News
News November 7, 2025
బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈవోను పీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కోరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పింది. మతం ఆధారంగా ఓటు వేయాలని సంజయ్ కోరారని, ఎన్నికల నిబంధలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది.
News November 7, 2025
స్వర్గమంటే ఇదే.. హిమాచల్ అందాలు చూడండి!

వింటర్ వెకేషన్‌కు విదేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం సంస్థలు స్థానిక అందాలను SMలో పంచుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెట్ల ఆకులన్నీ నారింజ రంగులోకి మారి, ప్రశాంత వాతావరణంతో భూతల స్వర్గంలా మారింది. ‘ఇది నార్వే కాదు.. హిమాచల్‌ప్రదేశ్’ అంటూ ‘Go Himachal’ పోస్ట్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్లో కులు మనాలీ, సిమ్లా వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిటకిటలాడనున్నాయి.
News November 7, 2025
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

తిరుపతిలోని <


