News February 27, 2026
పెంటగాన్ ఒత్తిడికి లొంగని ఆంథ్రోపిక్

తమ AI మోడల్ ‘క్లాడ్’ను అటానమస్ ఆయుధాల తయారీకి లేదా నిఘాకు ఉపయోగించొద్దన్న రూల్‌ను తొలగించాలని <<19249705>>పెంటగాన్<<>> చేసిన విన్నపాన్ని ఆంథ్రోపిక్ తోసిపుచ్చింది. దీనివల్ల $200 మిలియన్ల రక్షణ ఒప్పందం రద్దయ్యే ప్రమాదం ఉన్నా నైతిక విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 2026 నాటికి ఈ మార్పులు చేయాలని ఒత్తిడి వస్తున్నప్పటికీ మానవ ప్రమేయం లేని యుద్ధ తంత్రాలకు AIని అనుమతించబోమని కంపెనీ తేల్చిచెప్పింది.
Similar News
News April 14, 2026
IPL: త్వరలోనే SRH జట్టులోకి కమిన్స్?

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియా వచ్చి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిన ఆయనకు రేపు అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ జరగనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ నెల 17న ఆయన ఇండియాకు వస్తారని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన జట్టులో చేరే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
News April 14, 2026
బిహార్ కొత్త సీఎం.. తల్లిదండ్రుల నుంచి రాజకీయ వారసత్వం

బిహార్ కొత్త CMగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి 1968లో జన్మించారు. ఈయన తండ్రి శకుని చౌదరి 7 సార్లు MLA, ఓసారి MPగా గెలిచారు. తల్లి పార్వతి తారాపూర్ MLAగా పని చేశారు. 1990లో RJD నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత JDU, 2017లో BJPలో చేరారు. 2024 నుంచి Dy.CMగా ఉన్నారు. 2014-19, 2020-25 వరకు రెండుసార్లు MLCగా ఉన్నారు. కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఆ వర్గంలో మంచి పట్టుంది.
News April 14, 2026
850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.


