News January 23, 2025

పెంటపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎస్సీ పేటకు చెందిన పెనుమాక పైడిరాజు (45) కూలీ పని చేసుకొని జీవిస్తున్నాడు. బుధవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 25, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్..

image

ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి , జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి‌లతో కలిసి తేతలి, మండపాక లేఔట్లను, ఎస్ ఎన్ వి ఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలి ప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

News January 24, 2025

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

image

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ఏలూరు వైపు బైక్‌పై వెస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌కు లారీ తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్రాంతికుమార్ తలపై నుంచి లారీ వెనక టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పెదపాడు (మ)కడిమికొండ గ్రామ వాసిగా గుర్తించారు.

News January 24, 2025

ప.గో. త్వరలో ఆచంటలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు

image

ఆచంటలో రూ.కోటి వ్యయంతో త్వరలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉక్కు భారీ పరిశ్రమల కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం ఆచంట మండలం ఏ వేమవరం గ్రామంలో హాస్టల్ భవనాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డయాలసిస్ కేంద్రం మంజూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాత్ర ఎంతో ఉందన్నారు.