News March 25, 2025

పెంటపాడు: హత్య కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు.. జరిమానా

image

పెంటపాడు (M) ఆకుతీగపాడు గ్రామంలో ఆస్తి తగాదాలను కారణంగా చిన్నం శ్రీనివాస్ తన సోదరుడు వెంకటేశ్వర్లును హత్య చేశాడని స్థానిక ఎస్ఐ స్వామి తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చిన్నం శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెం 11వ ఏడీజే కోర్టులో సోమవారం హాజరపరిచగా, నేరం నిరూపణ కావడంతో ఏడేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ షేక్ సికిందర్ తీర్పు వెలువరించారు. పీపీ శివరామకృష్ణ సహకరించారన్నారు.

Similar News

News March 31, 2025

మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

image

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్‌రూమ్‌లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్‌పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్‌వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్‌కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.

News March 31, 2025

జీలుగుమిల్లి: అయ్యో పాపం.. ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటి?

image

ఉమ్మడి ప.గో జిల్లా జీలుగుమిల్లి(M) తాటియాకులగూడెంలో ఇటీవల హత్యకు గురైన గంధం బోసు హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోసు భార్య శాంతకుమారి ఆదివారం జైల్లో ఉరివేసుకుని మృతిచెందారు. దీంతో వారి పిల్లలు చెర్రీ(8), ఆరాధ్య(7) అనాథలయ్యారు. ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటో తెలియట్లేదు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల పరిస్థితిని చూసిన స్థానికులు అయ్యో పాపం వీరికి ఎంత కష్టమొచ్చిందో అని అంటున్నారు.

News March 31, 2025

కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన కొయ్యలగూడెం(M) సీతంపేట వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం(M) లక్కవరం గ్రామానికి చెందిన వీర నాగేశ్వరరావు, భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి రాజమండ్రి వెళ్తున్నారు. సీతంపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో నాగేశ్వరరావు మృతి చెందగా భార్యాపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.

error: Content is protected !!